![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -500 లో... తిరుపతి, రామరాజు మిల్ కి వెళ్తుంటే.. ధీరజ్ ఆగమని చెప్తాడు. నాన్న నా కార్ లో దింపుతానని అంటాడు. దాంతో రామరాజు కార్ ఎక్కుతాడు. వాళ్ళు ఇల్లు దాటకముందే ధీరజ్ కి ఫైనాన్స్ ఇచ్చినవాళ్లు వస్తారు. మన అగ్రిమెంట్ ప్రకారం కార్ గురించి కేసు ఫైల్ అయితే తీసుకొని వెళ్తానని చెప్పాను కదా అంటాడు. అది ఫేక్ కేసు అని ధీరజ్ అంటాడు. అవును అండి అని రామరాజు అంటాడు. అయిన వాళ్ళు వినిపించుకోరు. కార్ తీసుకొని వెళ్తారు.
భద్రవతి, సేనాపతి వాళ్ళు ధీరజ్, రామరాజులని తక్కువ చేసి మాట్లాడుతుంటే ధీరజ్ కీ కోపం వచ్చి కార్ పోతే ఏంటి బైక్ ఉంది.. మా నాన్న మాకు దైర్యం నేర్పాడని ధీరజ్ వాళ్లకి రివర్స్ కౌంటర్ ఇస్తాడు. ఆ తర్వాత మీరు అసలు మనుషులేనా.. ఎందుకు నా కొడుకుని ఇలా చేస్తున్నారు.. మీరు బాగుపడరు అని వేదవతి అంటుంది. ఆ తర్వాత సుకన్య, వల్లి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ డల్ గా కూర్చొని ఉంటుంది. పాపం మొగుడి కార్ ని తీసుకొని వెళ్లిపోయారు ఇంకా బాధపెట్టేలా చెయ్యాలని వల్లి అనుకొని సుకన్య, వల్లి డాన్స్ చేస్తుంటారు. పాపం కార్ పోయేనే అని వల్లి, సుకన్య అనుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే ప్రేమకి కోపం వచ్చి వల్లి అని గట్టిగా అరుస్తుంది.
రాత్రి నీకు కచేరి గట్టిగానే ఉందని ప్రేమ అనగానే వల్లి భయపడుతుంది. కచేరి అంటే ఏంటని సుకన్య అడుగుతుంది. అది పెద్ద కథ అని వల్లి అంటుంది. మరొకవైపు రామరాజు, తిరుపతి వెళ్తుంటే వారి బైక్ ఆగిపోతుంది. అప్పుడే నర్మద స్కూటీ పైన వస్తుంది. స్కూటీ ఎక్కండి మావయ్య అంటుంది. వద్దు అమ్మ మీరు వేరు కాపురం పెట్టారని తిరుపతి అనగానే ఇప్పుడు నేను మీ కోడలు అనుకోవద్దు.. దారిన పోయే వాళ్ళు అనుకొని ఎక్కండి అని నర్మద అనగానే రామరాజు ఎక్కుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |